top of page

ఐఐపిఇ - పెట్రో యూనివర్సిటీ

Writer's picture: CDVM COMMUNITYCDVM COMMUNITY

దేశ అవసరాలను తీర్చడం కోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం, ఎనర్జీ (ఐఐపిఇ - పెట్రో యూనివర్సిటీ)ని ఏర్పాటు చేసినట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.


అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలిలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పాట్నా నుంచి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు.


201.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో క్యాంపస్‌ నిర్మాణం చేపడుతున్నట్టు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శాలివాహన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బాధ్యతను సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్టుమెంట్‌ (సీపీడబ్ల్యూడీ)కు అప్పగించినట్టు పేర్కొన్నారు.


ఐఐపీఈలో అత్యాధునిక పరిశోధన ప్రయోగాలు కొనసాగుతాయన్నారు. వీటిల్లో సెంటర్‌ ఫర్‌ నెట్‌ జీరో, సెంటర్‌ ఫర్‌ హైడ్రోజన్‌, టెక్నాలజీ సెంటర్‌ ఫర్‌ హైడ్రోజన్‌ టెస్టింగ్‌ వాలిడేషన్‌, ఇంకా అకడమిక్‌, హాస్టల్‌ భవనాలు ఉంటాయన్నారు.


గ్లోబల్‌ ఎనర్జీ హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పలు అంశాలపై పెట్రో యూనివర్సిటీ పరిశోధనలు చేయనుందన్నారు. ఎన్‌టిపిసి సహకారంతో సముద్రపు నీటి నుంచి హైడ్రోజన్‌ ఉత్పత్తి కోసం పెట్రో యూనివర్సిటీ కృషి చేస్తుందని చెప్పారు.


రోజుకు ఒక టన్ను హైడ్రోజన్‌ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామన్నారు. రూ.35 కోట్లతో విశాఖపట్నాన్ని తొలి హైడ్రోజన్‌ సిటీగా మార్చనున్నామని చెప్పారు.

36 views0 comments

Recent Posts

See All

Comments


Innovation

CDVM Community strongly believes in fostering innovation and supporting ideas that have the potential to make a positive impact on society.

Promotion

CDVM Community is dedicated to promoting local businesses and supporting the craftsmanship of handmade products.

News

CDVM Community takes pride in its role as a reliable source of local news and useful information for the community.

Consulting

CDVM Community is dedicated to providing consulting and contact support services with the aim of uplifting society.

© 2024 by CDVM COMMUNITY |  Terms of Use  |  Privacy Policy

bottom of page