
మహిళల కోసం అనేక పథకాలు తీసుకొస్తోంది. వ్యాపారం చేయాలనుకునే పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగిని యోజన పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం గురించి పూర్తి వివరాలు మీ కోసం..
వ్యాపారం చేయాలనుకునే మహిళలు ఉద్యోగిని యోజన కింద బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. పథకంలో ప్రభుత్వం 30 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. ఈ పథకం కింద గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ బ్యాంక్ రుణానికి వారు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే, ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి.
మహిళ కుటుంబ ఆదాయం రూ. 1.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. వితంతువులు, వికలాంగ మహిళలకు ఆదాయ పరిమితి లేదు. ఈ లోన్ కోసం మీరు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఆధార్ కార్డు, బీపీఎల్ కార్డు, కుల ధృవీకరణ పత్రం వంటి పత్రాలను అందించాలి.
మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తోంది. మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకు వెళ్లి ఉద్యోగిని యోజన కింద లోన్ తీసుకోవచ్చు. ఇందుకు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్, పాన్, అడ్రస్ ఫ్రూప్ ఇతర పత్రాలు బ్యాంకులో అందజేయాలి.
Comments