బంగారంతో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బంగారం కొనుగోలులో సాధారణంగా వర్తించే మేకింగ్, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు గోల్డ్బాండ్ల విషయంలో ఉండవన్నది గమనించాలి.
గోల్డ్ సావరిన్ బాండ్లు కొనుగోలు చేసేవారు ఒక గ్రామ్ - ఒక యూనిట్ కింద కొనుగోలు చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు అత్యధికంగా నాలుగు కిలోలు, ట్రస్టులు 20 కిలోల వరకూ కొనుగోలు చేయొచ్చు.
ఈ బాండ్ గడువు ఎనిమిదేళ్లు ఉంటుంది. ఐదేళ్ల తర్వాత అవసరమనుకుంటే బాండ్ల కొనుగోలుదారులు తప్పుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు అమలులో ఉన్న 'కేవైసీ' నిబంధనలే బాండ్ల కొనుగోలుకు కూడా వర్తిస్తాయి.
భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్- 4.. ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు కొనసాగనుంది. ఈ బాండ్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్బీఐ బాండ్లు జారీ చేస్తుంది. ఆర్బీఐ ఇష్యూ చేసిన ధర యూనిట్‌కు 6,213 రూపాయలుగా ఉంది.
కమర్షియల్ బ్యాంకుల్లో ఈ సావరిన్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. వీటితో పాటు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, క్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పోస్టాఫీసులు, నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌లో కొనుగోలు చేయొచ్చు.
ఆన్లైన్ పెట్టుబడిదారులకు భారత ప్రభుత్వం గ్రాముకు రూ.50 తగ్గింపు ప్రకటించింది.
ความคิดเห็น