సైబర్ అటాక్స్ ద్వారా అమాయకుల ఖాతాల్లో నగదును మాయం చేసేందుకు కొత్త కొత్త ముఠాలు పుట్టుకొస్తున్నాయి.
గతంలో విదేశాల నుంచి ఆపరేట్ చేసే కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా ఇండియాలోనే తిష్ఠవేసి అందినకాడికి దోచుకుంటున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు పోలీసులు 'గోల్డెన్ అవర్'పై అవగాహన కల్పిస్తున్నారు.
2023లో సైబర్ నేరాల వల్ల 140 కోట్ల వరకు నష్టపోగా 44 కోట్లు ఫ్రీజ్ చేశామని, ఇందులో కేవలం 2 కోట్లలోపే తిరిగి బాధితులకు అందజేయగలిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
అయితే తాము మోసపోతున్నామని గ్రహించిన 2 గంటల్లోపు (గోల్డెన్ అవర్స్) 1930కు కాల్ చేసి సహాయం పొందాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ క్రైమ్‌లో మొదటి రెండు గంటల వ్యవధి చాలా ముఖ్యమంటున్నారు. నేరస్థుడి ఖాతాను స్తంభింపజేసి డబ్బు రికవరీ చేసేందుకు ఈ 'గోల్డెన్ అవర్'ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, ట్రేడింగ్, కొరియర్స్ పేరిట ఫ్రాడ్స్ విపరీతంగా పెరిగాయినట్లు ఆందోళనలు వెలువడుతున్నాయి. పోలీసుల పేరిట ఫోన్లు చేసి, డీప్ ఫేక్ వంటి ఆర్టిఫిషియ్ ఇంటిలిజెన్స్‌ను టెక్నాలజీ ఉపయోగించి వీడియో కాల్స్‌లో యూనిఫామ్‌లో కనిపించి బురిడీ కొట్టిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments