top of page

Aadhar ATM Service

Writer's picture: CDVM COMMUNITYCDVM COMMUNITY

ఇంట్లోనే కూర్చొని క్యాష్ విత్‌డ్రా చేసుకోవడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ద్వారా ఆధార్ ఏటీఎం (AePS) సర్వీసు సౌకర్యాన్ని అందిస్తోంది.


ఏఈపీఎస్ (AePS) సర్వీసులు అందుబాటులోకి :

ఏఈపీఎస్ కింద అందుబాటులో ఉన్న సేవల్లో భాగంగా కస్టమర్ నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతాలో బ్యాలెన్స్ గురించి తెలుసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ టు ఆధార్ చేయవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ సూచనల ప్రకారం.. ఏఈపీఎస్ పొందాలనుకునే కస్టమర్ తప్పనిసరిగా (AePS)లో పాల్గొనే బ్యాంక్‌తో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇతర బ్యాంక్‌లో కూడా ఆధార్‌ను ఆ అకౌంట్‌తో లింక్ చేయాలి. కస్టమర్ బయోమెట్రిక్ అథెంటికేషన్ మాత్రమే ఉపయోగించి లావాదేవీ పూర్తి చేయగలరు.


ఇంటింటికి ఆన్‌లైన్ ఏటీఎం సర్వీసులను ఎలా పొందాలి? :


IPPB ఆన్‌లైన్ ఆధార్ ఏటీఎం సర్వీసు కోసం ఇలా ప్రయత్నించండి.

  • ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వెబ్‌సైట్‌ (https://www.ippbonline.com/web/ippb)కి లాగిన్ చేయండి

  • నావిగేషన్ బార్‌లో 'Service Request'పై క్లిక్ చేయండి.

  • మీరు IPPB ఖాతాదారు అయితే 'IPPB Customer' ఎంచుకోండి లేదా IPPB కాని కస్టమర్‌లు 'non-IPPB Customers'ని ఎంచుకోవచ్చు

  • ఇప్పుడు 'Door Step Baking'పై క్లిక్ చేయండి

  • సర్వీసు రిక్వెస్ట్ ఫారమ్‌లో 'ఆధార్ ఏటీఎం - ఏదైనా ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణ' ఆప్షన్ ఎంచుకోండి

  • మొబైల్ నంబర్, ఇంటి నంబర్, సమీపంలోని పోస్టాఫీసు పిన్ కోడ్, ఇతర ముఖ్యమైన వివరాలను ఎంటర్ చేయండి

  • (terms and conditions) బాక్సులో టిక్ చేయండి.

  • మీకు అక్కడ కనిపించే 'text captcha'ని అలానే ఎంటర్ చేయండి

  • 'Submit'పై క్లిక్ చేయండి.

  • సర్వీసు రిక్వెస్ట్ ఫారమ్‌ను సమర్పించిన తర్వాత మీరు IPPB నుంచి రీసిప్ట్ మెసేజ్, ఆ తర్వాత ఏటీఎం సర్వీసు సమాచారాన్ని అందుకుంటారు.


కస్టమర్ ఆధార్ నంబర్‌తో మల్టీ అకౌంట్లను లింక్ చేస్తే ఏం చేయాలి :

ఖాతాదారుడు ఒకే బ్యాంకులో ఆధార్‌తో లింక్ అయిన మల్టీ అకౌంట్లను కలిగి ఉంటే.. (AePS) సర్వీసులో ఆధార్‌తో లింక్ అయిన ప్రైమరీ అకౌంటుతో మాత్రమే పనిచేస్తాయి. ప్రాథమిక ఖాతా లింకింగ్‌ను పేర్కొనడానికి/మార్చడానికి కస్టమర్ తన బ్యాంక్‌ని సంప్రదించాలి. అదేవిధంగా, అకౌంట్లు వేర్వేరు (మల్టీ) బ్యాంకులతో లింక్ అయితే.. (AePS) యాప్‌లో లావాదేవీ చేయాల్సిన బ్యాంకు పేరును ఎంచుకోవడానికి కస్టమర్‌కు ఆప్షన్ ఉంటుంది.

106 views0 comments

Recent Posts

See All

Comentarios


Innovation

CDVM Community strongly believes in fostering innovation and supporting ideas that have the potential to make a positive impact on society.

Promotion

CDVM Community is dedicated to promoting local businesses and supporting the craftsmanship of handmade products.

News

CDVM Community takes pride in its role as a reliable source of local news and useful information for the community.

Consulting

CDVM Community is dedicated to providing consulting and contact support services with the aim of uplifting society.

© 2024 by CDVM COMMUNITY |  Terms of Use  |  Privacy Policy

bottom of page